1 June, 2026 | 12:48 AM

కమనీయం.. సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం

01-06-2026 12:00 AM

మేడ్చల్ అర్బన్ మే 31(విజయక్రాంతి): మేడ్చల్  పట్టణంలోని లక్ష్మీ గార్డెన్ లో విష్ణు శౌర్య ఆధ్వర్యంలో వేద పండితులచే శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొని సంప్రదాయ పద్ధతిలో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.

ఈ సందర్భంగా విష్ణు శౌర్య మాట్లాడుతూ ప్రతీ యేట నిర్వహించే శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తు స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన కోరారు.కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిలుగా బిఆర్‌ఎస్ పార్టీ మేడ్చల్ ఇంచార్జి చామకూర మహేందర్ రెడ్డి.ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి.మున్సిపల్ మాజి కౌన్సిలర్ లతో పాటు నాయకులు హాజరై పూజలు చేశారు.