1 June, 2026 | 12:47 AM

మేడ్చల్ ఆర్టీసీ కాలనీలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు

01-06-2026 12:00 AM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్

మేడ్చల్ అర్బన్, మే 31 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని ఆర్టిసి కాలనీలో వాహనాల వేగాన్ని తగ్గించడానికి సిసి రోడ్లపై రామన్నగారి సంతోష్ గౌడ్ స్పీడ్ బ్రేకర్ లను ఏర్పాటు చేయించినట్లు  తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రజల రహదారి భద్రతను దృష్టిలో పెట్టుకొని కాలనీలో సొంత నిధులతో స్పీడ్ బ్రేకర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

అదేవిధంగా కాలనీలో వాహనాలు అధిక వేగంతో పరుగెత్తడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు స్పీడ్ బ్రేకర్ లను ఏర్పాటు చేయించినట్లు సంతోష్ గౌడ్ స్ప ష్టం చేశారు.దీనితో పాదాచారులు విద్యార్థు లు స్థానిక నివాసితులకు భద్రత మరింత పె రుగుతుందని ఆర్టిసి కాలనీ వాసులు అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జి ల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సత్యనారాయణ, మహేందర్, శ్రీకాంత్, యాదగిరి, జితు, ఆర్య, వెంకటేష్, పవన్ కుమార్ గౌడ్, మల్లేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్, సంతోష్ గౌడ్ సేవలను అభినందిం చి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.