3 April, 2026 | 4:12 AM

డిజిటల్ అరెస్ట్ చట్టంలో ఎక్కడా లేదు

03-04-2026 01:35 AM

మేడ్చల్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్

మేడ్చల్ అర్బన్, మార్చి 2(విజయక్రాంతి): డిజిటల్ అరెస్టు చట్టంలో ఎక్కడా లేదని సైబర్ మోసాలపై ప్రజలకు మేడ్చల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కిరణ్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసాలపై మేడ్చల్ నేర విభాగం పోలీసులు మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు చెప్పారు.

అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ అనే పదం చట్టపరిధిలో ఎక్కడ రాసి లేదని డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ మోసగాళ్లు భయభ్రాంతులకు గురిచేస్తే భయాందోళనకు చెందకుండా ఉండాలని ఇన్స్పెక్టర్ కిరణ్ సూచించారు. సమాజంలో పోలీస్ అధికారులు యూనిఫామ్ ధరించి డిజిటల్ అరెస్టులు చేయరని అలా చట్టంలో ఎక్కడ లేదని ఆయన స్పష్టం చేశారు.

తక్కువ ధర ఆశ చూపి వాహనాలు మొబైల్ ఫోన్స్ అమ్ముతామని ముందే డబ్బులు అడిగితే డబ్బులు చెల్లించకూడదని ఆయన ప్రజలకు సూచించారు. నేరుగా కొనుగోలు చేస్తేనే సైబర్ మోసం బారిన పడకుండా ఉంటారని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు.

పొరపాటున సైబర్ మోసానికి గురైతే 1930 నంబర్ కు కాల్ చేసే బాధితులు ఫిర్యాదు చేసుకోవాలని ఆయన చెప్పారు. సంబంధం లేని అవసరం లేని దరఖాస్తులను మొబైల్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేయకుండా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ హెడ్ కానిస్టేబుల్  కానిస్టేబుల్ లు శక్రులాల్ కానిస్టేబుల్‌లు పూజిత, అక్షర, రాజులతో పాటు ప్రజలు పాల్గొన్నారు.