19 March, 2026 | 7:47 AM

కుప్పకూలిన మిగ్-29

05-11-2024 01:10 AM
  1. ముందే దూకేసిన ఇద్దరు పైలట్లు
  2. ఆగ్రా సమీపంలో ఘటన

లక్నో, నవంబర్ 4: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మిగ్ -29 ఫైటర్ జెట్ కుప్పకూలింది. ప్రమాదాన్ని ముందే ఊహించి ఇద్దరు పైలట్లు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. విన్యాసాల కోసం సోమవారం పంజాబ్‌లోని అదంపూర్ నుంచి బయల్దేరిన జెట్ ఆగ్రా సమీపంలోకి చేరుకోగానే మంటలు చెలరేగాయి.

అప్రమత్తమైన పైలట్లు కిందకు దూకేశారు. తర్వాత జెట్  కాగరౌల్ ప్రాం తంలోని పొలాల్లో క్రాష్ అయింది. జెట్ మరో ౨ కిలోమీటర్ల తర్వాత ల్యాండ్ కావాల్సి ఉండగా, అంతకుముందుగానే క్రాష్ అయిందని ఎయిర్‌ఫోర్స్ వర్గాలు తెలిపాయి. జెట్ క్రాష్‌పై ఇప్పటివరకు ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు ఎలాం టి అధికారిక ప్రకటన చేయలేదు.