మైనర్ విద్యార్థులపై లైంగిక దాడి
నిందితులపై పోక్సో కేసు నమోదు
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): ఇద్దరు మైనర్ విద్యార్థులపై ముగ్గురు మైనర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి భౌరంపేట్ లోని గల తెలంగాణ స్టేట్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ లో లైంగిక దాడికి గురైన ఇద్దరు మైనర్ విద్యార్థులు 5వ తరగతి చదువుతున్నారు.
అదే మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్ లో చదివే ముగ్గురు మైనర్ విద్యార్థులు వీరిద్దరిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే బాధితులు ఇద్దరు మైనర్లు కావడంతో ఈ విషయాన్ని స్కూల్ యజమానానికి తెలియజేయలేదు.బాధితులు శనివారం ఇంటికి వెళ్లిన అనంతరం తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో బాధితుల తల్లిదండ్రులు ఆదివారం దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






