బ్యాగ్ పోగొట్టుకున్న యువకుడు.. అందులో ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్
03-08-2026 04:05 PM
చిట్యాల,(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన భీమవరపు వెంకటేష్ తన విలువైన విద్యా ధృవపత్రాలు ఉన్న బ్యాగ్‌ను పోగొట్టుకున్నారు. వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం... జూలై 23న తన మిత్రుడి ఇంటికి చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామానికి వెళ్లి, తిరుగు ప్రయాణంలో శివనేనిగూడెం నుంచి చిట్యాల బస్టాప్‌కు వస్తుండగా బ్యాగ్ కనిపించకుండా పోయిందని, పోగొట్టుకున్న బ్యాగ్‌లో ఇంటర్మీడియట్ మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ), ఆధార్ కార్డు సహా ఇతర ముఖ్యమైన విద్యా సంబంధిత పత్రాలు ఉన్నట్లు తెలిపారు. ఇవి తన భవిష్యత్‌కు ఎంతో అవసరమైనవని పేర్కొన్నారు. బ్యాగ్ లేదా అందులోని పత్రాలు ఎవరికైనా దొరికితే తిరిగి అందించాలని, మొబైల్ నంబర్ 9391308811కు సమాచారం ఇవ్వాలని వెంకటేష్ విజ్ఞప్తి చేశారు.






