calender_icon.png 5 December, 2024 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో గ్యాంగ్ వార్

15-10-2024 12:23:01 AM

రాళ్లు, కర్రలతో దాడి, ప్రతిదాడులు

జగిత్యాల, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలో శని వారం రాత్రి మద్యం మత్తులో గ్యాం గ్ వార్ జరిగింది. రాళ్లు, కర్రలతో దాడి, ప్రతి దాడులు చేసుకోగా కొం దరి తలలు పగిలాయి. జగిత్యాల తు లసినగర్‌లో ఉంటున్న బింగి అనుదీ ప్ అనే యువకుడి ఇంటికి శ్రీరామ్‌నగర్‌కు చెందిన యువకుడు మరికొ ందరు స్నేహితులో వచ్చి, మద్యం మత్తులో వచ్చి విచక్షణా రహితంగా దాడి చేశారు.

కర్రలతో దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన కుటుంబ స భ్యులపైనా దాడి చేశారు. ఇంట్లో ఉన్న సామాగ్రిని ధంసం చేశారు. ఈ దాడిలో హరిక్ అనే యువకుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అం దించగా పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దాడులకు పాల్పడుతున్న యువకులను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.