10 July, 2026 | 5:01 PM

ఆరు నెలల వరకు బీడీ కంపెనీ ఇక్కడే ఉంటుంది

10-07-2026 03:58 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో ఉన్న దేశాయి బీడీ కంపెనీ మరో ఆరు నెలల వరకు ఇక్కడే ఉంటుందని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ పేర్కొన్నారు గత 20 రోజులుగా సోనాల నుండి దేశ బీడీ కంపెనీ తరలిపోతుందని కార్మికులు ఆందోళన వ్యక్తపరిచారు. అయితే వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత యాజమాన్యంతో మాట్లాడడం జరిగిందన్నారు. అంతేగాక కొంతమంది ప్యారాచూట్ లీడర్లు గాలి మాటలు చెప్పి మభ్యపెడుతున్నారని చిత్తశుద్ధి ఉంటే కార్మిక శాఖ మంత్రితో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు మండల అభివృద్ధికి ఎమ్మెల్యేతో కలిసి ముందుకు వెళ్తామన్నారు ఈ సందర్భంగా టెక్ేదారులు ఎంపీపీకి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో టేకేదారులు భూషణ్ నరసయ్య లక్ష్మణ్ కార్మికులు రాజేశ్వర్ చందు చిన్నయ్య గణేష్ శ్రీనివాస్ ప్రవీణ్ రవి శివాజీ తదితరులు ఉన్నారు ఆయన వెంట సర్పంచ్ బిందుజ సుధీర్ రెడ్డి ఉన్నారు