2 July, 2026 | 3:56 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

కుటుంబ విలువలను తెలిపే ఓ తండ్రి తీర్పు

29-12-2024 09:14 PM

ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్‌పై లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ఓ తండ్రి తీర్పు’. ఈ సినిమా ద్వారా వివరెడ్డి హీరోగా పరిచయం అయ్యారు. ప్రతాప్ భీమవరుపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రాజేంద్రరాజు కాంచనపల్లి రచనాదర్శకత్వ పర్యవేక్షణ చేశారు. డిసెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ఓ తండ్రి తీర్పు’ సినిమాను కుటుంబ విలువలతో నిర్మించారు. తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై లేకపోవటం ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందనే ఇతివృత్తంగా ఈ సినిమా ఉందని ప్రసంశలు వస్తున్నాయి. కొడుకుగా వివరెడ్డి చేసిన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉందంటున్నారు.

మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి నిరూపితమైంది. రాజేంద్ర, ప్రతాప్, శ్రీరామ్, కునాల్, కుషాల్, చిత్రం బాషా, అనురాధ, రారాజు, సురభి శ్రావణి, పునర్వి, రమ్య, శివాజీ, రామకృష్ణ, మంజుల, స్వాతి, జ్యోతి, కేవీఎల్ నరసింహారావు, లక్ష్మీనారాయణ, కేవీఎన్ రాజు, పేరిణి శ్రీకాంత్, గుండు బ్రదర్స్, జబర్దస్త్ నాగరాజు, లక్ష్మీ కిరణం, వాసు, సాధనాల వెంకటస్వామి నాయుడు, మిమిక్రీ రాజు, రాము, అయ్యప్ప, ప్రమీల, అమృత వర్షిణి, సాయిచరణ్, సాయితేజ తదితరులు తారాగణంగా ఉన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేశ్ చెటిపల్లి; సంగీతం: మధు బాపు శాస్త్రి; పాటలు: రాజేంద్రరాజు కాంచనపల్లి, హరిత, కళారత్న బిక్కి కృష్ణ, డాక్టర్ దాసరి వెంకటరమణ; నేపథ్య సంగీతం: చరణ్ అర్జున్; కో డైరెక్టర్స్: శేషు కుమార్, కళింగ రంగనాథ్ కొత్తకోట; ఆర్ట్: దుద్దుపూడి ఫణి రాజు.