భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.!
- రైతుల సమక్షంలోనే భూ రీ సర్వే చేయాలి
కొల్లాపూర్ రూరల్: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూ రీ సర్వేను(Land Re-Survey) పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్(Collector Hemant keshav patil) అధికారులను ఆదేశించారు. మంగళవారం కొల్లాపూర్ నియోజకవర్గం(Kollapur Constituency) మొలచింతలపల్లి శివారులో జరుగుతున్న రీ సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి సర్వే నంబర్‌ను క్షుణ్ణంగా కొలిచి, భూ వివరాలను డిజిటలైజ్ చేయాలని సూచించారు. రైతుల సమక్షంలోనే కొలతలు నిర్వహించి, భవిష్యత్తులో వివాదాలకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. గ్రామంలో 41,954 ఎకరాల 16 గుంటల భూమి ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బి.చెన్నయ్య, ఆర్డీఓ బన్సీలాల్, ఏడీ గిరిధర్, తహసీల్దార్ మాధవి, సర్వేయర్లు ఉన్నారు.






