2 July, 2026 | 4:55 PM

Breaking News

అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •   "స్క్రాప్" పై అంత ప్రేమెందుకు..?   •   ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన   •   యువత సమాజ సేవలో ముందుండాలి   •   పీ ఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి....   •   రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేపించిన ఎమ్మెల్యేకు పాలాభిషేకం   •   పట్టా ఉన్న రైతులకు భూమి అప్పగించాలి: సేవాలాల్ సేన   •   చెట్టే శాపమైందా..? ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు పగుళ్లు   •   బహిరంగ చర్చకు వెనక్కి తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వమే: సిలివేరి సత్యనారాయణ   •  

కిరణ్ రొమాంటిక్ యాక్షన్

29-12-2024 08:18 PM

యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా 'దిల్ రూబా’. ఇందులో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్స్ ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారిగమకు చెందిన నిర్మాణ సంస్థ అయిన ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేశ్‌రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. 'క’ సినిమా విజయం తర్వాత కిరణ్ అబ్బవరం నటిస్తున్న చిత్రం కావడంతో ఇప్పట్నుంచే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జనవరి 3న టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డానియేల్ విశ్వాస్; సంగీతం: సామ్ సీఎస్; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్.