పెళ్లిలో చికెన్ లెగ్‌పీస్ కోసం కొట్లాట
ఉత్తరప్రదేశ్ పెళ్లి వేడుకలో ఘటన
సోషల్ మీడియాలో వీడియో వైరల్
లక్నో, జూన్ 25 : ఓ పెళ్లి వేడుకలో ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ బరేలీలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో తమకు వడ్డించిన బిర్యానీలో ఒక్క చికెన్ లెగ్‌పీస్ కూడా లేదని వరుడి తరుపు వారు కోపోద్రికులై వధువు తరుపు వారిపై గొడవకు దిగా రు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అది చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ వీడియోలో ఇరు కుటుంబాలు ఘర్షణ పడుతుండటం గమనించవచ్చు. అలాగే ఓ వ్యక్తి ప్లాస్టిక్ కుర్చీని మరొక వ్యక్తిపై విసిరినట్లు కనిపిస్తోంది. ఈ గొడవ ఎంతకూ ఆగకపోవడంతో విసుగు చెందిన వరుడు.. పెళ్లి చేసుకోవడం లేదని ప్రకటించాడు. దీంతో అరగంట వరకు కొనసాగిన గొడవ ఒక్కసారిగా ఆగిపోయింది. వధువు తరపు వారు నచ్చజెప్పడంతో మనసు మార్చుకొని చివరికి పెళ్లి పీఠల మీదికి ఎక్కాడు. దీంతో పెళ్లితంతు సజావుగా సాగింది.






