30 April, 2026 | 2:26 AM

సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే చిత్రం కర

30-04-2026 01:45 AM

ధనుష్, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘కర’. విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో డాక్టర్ ఐషరి కే గణేశ్ నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా వి ఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సీహెచ్ సతీశ్‌కుమార్ మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే.. “చిన్న సినిమాల్ని కొంటూ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించా. ఓ మూ వీని నిర్మించా. అర్జున్‌రెడ్డి, కబాలి, సింగం 3, సలార్, కాంతారా చాప్టర్ 1 సినిమాల్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూషన్ చేశా. ధనుష్ ‘ధర్మయోగి’ని తెలుగులో రిలీజ్ చేశా. ప్రొడక్షన్‌లోనూ మంచి సినిమాల్ని చేయాలనుకుంటున్నా.

ఈ మూవీని నా శక్తి మేరకు తెలుగు ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్తా. ధనుష్ సినిమా అంటే చాలా మంది పోటీ పడతారు. కానీ నేను పర్సనల్‌గా కేర్ తీసుకుని నిర్మాత గణేశ్‌ను సంప్రదించా. నా ప్రయత్నం చూసి ఈ చిత్రాన్ని నాకు ఇచ్చారు. ఇప్పటికే 80 శాతం బిజినెస్ పూర్తయింది. దాదాపు 400కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. హిందీ వెర్షన్‌తో కలిపితే 600కి పైగా స్క్రీన్లలో వచ్చే అవకాశం ఉంది. కరస్వామి అనే వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందుకే తెలుగులో ‘కర’ అనే టైటిల్ పెట్టారు. సాధారణ ప్రేక్షకులందరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ఓ సాధారణ మనిషికి ఎదురయ్యే సమస్యల్ని చాలా స్ట్రాంగ్, ఎమోషనల్ కంటెంట్‌తో ‘కర’ రాబోతోంది. థియేటర్ల బంద్ అనేది ఉండకపోవచ్చు. మంచి కంటెంట్ మూవీ వస్తుంటే థియేటర్ల బంద్ అనేది ఉండదు. అసలే వేసవిలో ఇంతవరకు ఓ పెద్ద సినిమా రాలేదు. మా ‘కర’ మూవీకి అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా” అని తెలిపారు.