24 June, 2026 | 10:31 AM

కాంగ్రెస్ కార్యకర్తలు రైతులకు ధైర్యం ఇవ్వండి

24-06-2026 09:46 AM

నాగిరెడ్డిపేట్,జూన్ 24 (విజయక్రాంతి): మండలంలోని పోచారం గ్రామంలో ఆయా గ్రామాలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ నాయకులతో,కార్యకర్తలతో కలిసి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా పేద ప్రజలు గుడిసెలతో సతమతమవుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడంతో పేద ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారన్నారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాగిరెడ్డిపేట మండలం జిల్లాలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు.ప్రతి గ్రామంలో హనుమాన్ మందిరం మాదిరిగా ఇందిరమ్మ ఇండ్లు కనిపిస్తున్నాయని తెలిపారు.

నాగిరెడ్డిపేట్ మండలం పంటలు పండించడంలో ముందుందన్నారు. పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలు అభివృద్ధి కొరకు రెండు కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని పనులు జరుగుతున్నాయని ఈవర్షాకాలం పూర్తయ్యే వరకు పోచారం ప్రధాన కాలువ పనులు పూర్తయితాయని ఎమ్మెల్యే మదన్మోహన్రావు తెలిపారు.పోచారం ప్రాజెక్టు పర్యాటక కేంద్రంలో భాగంగా  టాయిలెట్స్ పార్కింగ్ వివిధ వాటికి 75 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

అలాగే తాండూర్ త్రిలింగేశ్వర ఆలయం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు భక్తులకు ఎంతో పవిత్రమైందని ఆలయం అభివృద్ధి త్వరలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ప్రతిపక్షాల నాయకుల మాటలు పట్టి రైతులు ఎవరు అధైర్య పడవద్దని యూరియా సరిపడా అందుబాటులో ఉందన్నారు.వ్యవసాయ అధికారులతో మాట్లాడి ప్రతి రైతుకు సరిపడ యూరియా అందజేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులకు ధైర్యం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,ఎమ్మార్వో బిక్షపతి,పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.