29 April, 2026 | 2:13 AM

ఈసారి యాక్షన్ మామూలుగా ఉండదు!

29-04-2026 12:26 AM

తెలుగులో తొలిచిత్రం ‘ఏ మాయ చేసావే’ సూపర్ హిట్ కావటంతో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంది సమంత. దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది వంటి భారీ విజయాలతో టాలీవుడ్ గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది. ఇక సమంత కెరీర్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’తో వస్తోంది. నందినిరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సమంత యాక్షన్‌తో ఆకట్టుకోనుంది.

ఏప్రిల్ 28న సామ్ పుట్టినరోజు. ఆమెకు ఈ చిత్రబృందం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలో సమంత స్టంట్స్ అదరగొట్టారని తెలియజేస్తూ ఆమెను బీస్ట్ అని పేర్కొన్నారు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ. డైరెక్టర్ నందినిరెడ్డి, డీవోపీ ఓం ప్రకాశ్ కూడా ప్రశంసలు కురిపించారు. చివరలో సమంత ‘ఈసారి యాక్షన్ మామూలుగా ఉండదు.. చూస్తారుగా..’ అని చెప్పటం ఆకట్టుకుంది. ఈ సినిమా మే 15న విడుదల కానుంది.