25 May, 2026 | 1:05 AM

సైకిల్ ర్యాలీతో ఫిట్‌నెస్ సందేశం

25-05-2026 12:00 AM

కుషాయిగూడ, మే 24 (విజయక్రాంతి): సీఐఎస్‌ఎఫ్ ఎన్‌ఎఫ్సీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 75వ ఎడిషన్‌ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శారీరక దారుఢ్యం, ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమానికి కమాండెంట్ శంకరరావు బైరెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ హరేంద్ర హాజరై సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఫిట్‌నె స్ అభిరుచి కలిగిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సైక్లింగ్ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. దేశాన్ని ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన భారతంగా ఐక్యత, సేవాభావాన్ని ప్రతిబింబించిందన్నారు.