17 April, 2026 | 11:03 AM

నాటి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త.. నేటి ప్రధాని!

28-12-2025 01:57 AM

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ ప్రశంసలు కాంగ్రెస్‌లో కలకలం రేపిన పోస్ట్

  1. అద్వానీ పాదాలచెంత మోదీ కూర్చొని ఉన్న పాత ఫొటో షేరింగ్

సంస్థాగత శిక్షణకు ఇదే నిదర్శనమంటూ కితాబు

‘సంఘ్’ను చూసైనా కాంగ్రెస్ నేర్చుకోవాలని సందేశం

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: తన మనసులోని ఆలోచనలు, భావనలను కుండబద్దలు కొట్టిన్నట్టు బాహాటంగా ప్రకటించే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి తనదైన శైలిలో సొంత పార్టీపై విమర్శలు చేశారు. ‘నన్ను ఇటీవల ఒక ఫొటో ఆక ట్టుకుంది. ఆ ఫొటో ఎంతో ఆసక్తికరంగా ఉంది. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ కుర్చీలో కూర్చొని ఉండగా, ఆయన పాదాల చెంత.. నేలపై నరేంద్ర మోదీ కూర్చుని ఉన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసిన మోదీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.

ప్రస్తుతం దేశ ప్రధానిగా సేవలందిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఒక సాధారణ కార్యకర్త ఎదిగిన తీరు ను చూడండి. అదే ఆర్‌ఎస్‌ఎస్ గొప్పతనం. సంస్థ కార్యకర్తలకు ఎంతోగొప్పగా శిక్షణ ఇస్తుందనడానికి ఈ ఫొటో ఒక నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ కూడా సంస్థాగతంగా ఎదగాలి. అగ్రనాయకత్వం మారాలి. అధికార వికేంద్రీకరణ జరగాలి. ఆర్‌ఎస్‌ఎస్ పనితీరును చూసైనా కాంగ్రెస్ నేర్చుకోవాలి’ అం టూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగి కాంగ్రె స్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీపై ప్రశంసల వర్షం కురిపిం చారు.

శనివారం ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోదీకి సంబంధించిన పాత ఫొటోను షేర్ చేశారు. ‘జై సియారామ్’ అంటూ.. ఆయన తన సందేశాన్ని ముగించారు. అంతేకాదు.. ఈ పోస్టును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాం ధీని సైతం ట్యాగ్ చేశారు. పోస్ట్ ద్వారా కాం గ్రెస్ పార్టీలో కూడా భారీ మార్పులు రావాలని ఆయన పరోక్షంగా సూచించారు.

క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో పార్టీ అగ్రనాయకత్వం విఫలమవుతున్నదని అభిప్రాయపడ్డారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెరగాలని దిగ్విజయ్ సింగ్ కోరు తున్నట్లు పోస్ట్ ద్వారా స్పష్టమవుతున్నది. 

సీడబ్ల్యూసీ భేటీ తొలిరోజే

ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరుగుతున్న సమయంలో దిగ్విజయ్ సింగ్ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీని కొనియాడతూ పోస్టు చేయడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. నిన్న మొ న్నటివరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, త్రివేండ్రం ఎంపీ శశిథరూర్ కేంద్ర ప్రభుత్వా న్ని ప్రశంసించి సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొనగా, తాజాగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీని కొనియాడుతూ మరోనేత ట్వీట్ చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైం ది. పార్టీ పరమైన అంశాల్లో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఒప్పించడం అంత సుల భం కాదని గతంలో దిగ్విజయ్‌సింగ్ చేసిన విమర్శలు కూడా మరోసారి చర్చకు వస్తున్నాయి.

పోస్టుపై దిగ్విజయ్ స్పందన

ట్వీట్ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీయడంతో దిగ్విజయ్ తన ట్వీట్‌పై స్ప ష్టతనిచ్చారు. తాను ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను ఎప్పటికీ సమర్థించబోనని తేల్చి చెప్పారు. కేవలం ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత సా మర్థ్యాన్ని మాత్రమే ప్రశంసించానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మున్ముందు ఒక ప్ర జా ఉద్యమంలా ఉండాలని మాత్రమే తాను ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సంస్కరణలు చేపడితేనే భవిష్యత్తులో గెలుపు సాధ్యమవుతుం దని అభిప్రాయపడ్డారు. పార్టీని గ్రామస్థా యి నుంచి జాతీయస్థాయి వరకు పునః నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధా ని మోదీ విధానాలను తాను వ్యతిరేకిస్తూనే ఉంటానని, తన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత మార్పులు, సంస్కరణలు రావాలనేదే తన అభిమతమని స్పష్టం చేశారు. మరోవైపు దిగ్విజయ్ పోస్టుపై పలువురు బీజేపీ నేతలు స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు తారస్థాయిలో ఉన్నాయనడానికి దిగ్విజయ్ పోస్టే నిదర్శనమని ఉదాహరిస్తున్నారు.