28-12-2025 11:02:49 AM
మంథని,(విజయక్రాంతి): ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యత, సద్భావనలను పెంపొందిస్తాయని అయ్యప్ప స్వామి మహా పడిపూజలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు తెలిపారు. శనివారం మంథని నియోజకవర్గంలోని మహాదేవపూర్ మండల కేంద్రంలో మాజీ సింగల్ విండో ఛైర్మెన్ చల్ల తిరుపతి రెడ్డి ఆహ్వానం మేరకు వారి గృహంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో శ్రీను బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.