18 March, 2026 | 2:31 AM

సెయింట్ జార్జ్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు

18-03-2026 12:54 AM

కొత్తపల్లి, మార్చి 17 (విజయ క్రాంతి): నగరంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల ఆవరణలో ముస్లిం అధ్యాపక బృందానికి, సిబ్బందికి విద్యాసంస్థల యాజమాన్యం మంగళవా రం ఘనంగా ’ఇఫ్తార్ విందు’ ఏర్పాటు చేసింది.

పాఠశాల చైర్మన్ డా.పి.ఫాతిమా రెడ్డి హాజరై మాట్లాడుతూ మన పాఠశాల ఒకే కుటుంబమని, అన్ని పండుగలను కలిసి జరుపుకోవడం వల్ల సోదరభావం పెంపొందుతుందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో పాటించే ఉపవాస దీక్షలు క్రమశిక్షణకు ప్రతీక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  ప్రిన్సిపల్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.