18 March, 2026 | 4:06 AM

సుల్తానాబాద్‌లో హోటల్‌పై దాడులు:8 సిలిండర్లు పట్టివేత

18-03-2026 12:52 AM

సుల్తానాబాద్, మార్చి 17 (విజయక్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న పలు హోటళ్లపై సివిల్ సప్లై శాఖ అధికారులు మంగళవారం  ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురి పై కేసులు నమోదు చేసి మొత్తం ఎనిమిది సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన ఎల్పీజీ సిలిండర్లను వ్యాపార అవ సరాలకు వినియోగించడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఈ తనిఖీలలో సివిల్ సప్లై డీటీ సి ఎస్ మహేష్ , రవీందర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి  పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.