ఘనంగా మహిళా దినోత్సవ కార్యక్రమం
10-03-2026 01:18 AM
గాంధారి, మార్చి 9 ( విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో, ఐకెపి కార్యాలయ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని డీఆర్డీవో ఏపీడీ విజయ లక్ష్మీ , పలువురు మహిళా అధికారులు, సిబ్బంది మరియు మహిళా సంఘాల సభ్యులను గాంధారి ఎంపీడీవో రాజేశ్వర్, ఐకెపి ఏపీఎం ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళ అని ప్రతీ ఒక్కరు మహిళను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి డిపిఎం రాజయ్య, సీసీ గొర్రె రాములు, ఐకెపి విఒఎ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గౌస్ ఖాన్, సీసీలు కాశీనాథ్ , రమేష్, శేఖర్, విక్రమ్, గోపాల్, భాస్కర్, శ్రీనివాస్ పలువురు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు..




