డిజిటల్ ఓటింగ్‌కు మార్గదర్శి
ఐటీ విప్లవానికి ముందే ఈవీఎంలను పరిచయం చేసిన భారత్
డిజిటల్ సాధికారత సాధించిన దేశంగా ఘనత
దేశానికి గర్వకారణంగా నిలిచిన ఈవీఎం యంత్రాలు
1982లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమై 2004 నాటికి పూర్తి స్థాయిలోకి వినియోగం
ఇప్పటికీ సురక్షితంగా ఎన్నికల నిర్వహణ
న్యూఢిల్లీ, మే 1౯: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ఎప్పుడూ ప్రపంచదేశాల దృష్టి ఉంటుంది. దాదాపు 100 కోట్ల ఓటర్లు ఉన్న దేశంలో ఎన్నికల నిర్వహణ కఠిన సవాలుతో కూడుకున్న విషయం. రెండు దశాబ్దాల కింద ఓట్ల ప్రక్రియ కోసం దేశంలో బ్యాలెట్ పేపర్‌ను ఉపయోగించేవా రు. ఇది ఫలితాల సమయంలో చాలా ఆలస్యానికి కారణమయ్యేది. రిజల్ట్స్ వెల్లడిం చేందుకు ఒకటి, రెండ్రోజులు పట్టేది. కానీ, ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లను వాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా వీటిని మొదట పరిచయం చేసింది భారత్ కావడం విశేషం.
ఐటీ విప్లవానికి ముందే..
అది 1982 మే 19. కేరళలోని నార్త్ పరవూరు నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. దీని పరిధిలో మొత్తం 50 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఈవీఎంలను మొదటిసారిగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇలాంటి డిజిటల్ ఆవిష్కరణ ఐటీ విప్లవానికి ముందే రావడం గమనించాల్సిన అంశం. అప్పుడప్పుడే అమెరికాలో ఐబీఎం వ్యక్తిగత కంప్యూటర్లను ఆవిష్కరించింది. దాదాపు దశాబ్దం తర్వాత 1990లో మాత్రమే నెదర్లాండ్స్ ఈవీఎంలను వాడిన రెండో దేశంగా రికార్డుల్లోకి ఎక్కింది.
వందల ఏళ్ల క్రితం సున్నాను కనిపెట్టింది భారత్ అని గర్వంగా చెప్పుకుంటాం. అదే జీరోను ఎన్నికల్లోనూ వాడటం మన దేశమే మొదలుపెట్టింది. అంటే.. డిజిటల్ భాషలో 0,1 అనే బిట్లలోనే సమాచారాన్ని నిక్షిప్తం చేస్తాయి. ఈ రోజు దాదాపు 100 కోట్ల మంది ప్రజలు తమ ఓట్లను ట్యాంపర్ చేయడానికి వీలులేని మూడో తరం ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యా నికి డిజిటల్ సాధికారతను భారత్ కల్పించగలిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ఐఐటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఓ శాస్త్రవేత్త వివరించారు.
దేశానికి గర్వకారణం..
ఈవీఎంలు మన దేశానికి గర్వకారణం. ఇవి అబద్ధాలు చెప్పవు. ఈ యంత్రాల విశ్వసనీయతపై నాకు ఎలాంటి సందేహం లేదు అని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చీఫ్ టీఎస్ కృష్ణమూర్తి నొక్కి చెప్పారు.
సైబర్ దాడులు జరగకుండా..
ఇప్పటికీ చాలా దేశాలు ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో వెనుకబడి ఉన్నాయి. కొన్ని దేశాలు ప్రయత్నించినా సైబర్ దాడులకు భయపడి వెనక్కు తగ్గాయి. నెదర్లాండ్స్, జర్మనీ ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై నిషేధం విధించాయి. భారత్‌లోని ఈవీఎంలు అద్భుతమైనవి. ఇవి 21 శతాబ్దం కోసం ప్రత్యేకం గా తయారుచేశారు. వీటిని సురక్షితం గా, హ్యాకింగ్‌కు వీల్లేకుండా రూపొందించారు’ అని ఐఐటీ బాంబే శాస్త్ర వేత్త చెప్పారు. ఇవి ఓ క్యాలిక్యులేటర్‌లాగా పనిచేస్తాయి. వీటికి ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కనీసం బ్లూటూత్ కు అనుసంధానం చేయలేం. ప్రస్తు తం ఉపయోగిస్తున్న మూడో తరంలోనూ ఈ సదుపాయాలు ఈసీ కల్పించలేదు.






