కుటుంబ కథాచిత్రం కరుణామయ
చైతన్యశక్తి, స్వాతిశ్రీ జంటగా బాబీ పిక్చర్స్ బ్యానర్‌పై సంకాబత్తుల నాగేశ్వరరావు నిర్మించనున్న చిత్రం ‘కరుణామయ’. ఈ సినిమాకు హర్షవర్దన్ పారెళ్ల దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, వీఎన్ ఆదిత్యల చేతుల మీదుగా ఈ సినిమా బుధవారం నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా హీరో చైతన్యశక్తి మాట్లా డుతూ.. “ఇంత మంచి కథతో తెరకెక్కుతున్న ‘కరుణామయ’ చిత్రంలో హీరోగా నాకు అవకాశం రావడం ఆనందంగా ఉంది” అన్నారు.
హీరోయిన్ స్వాతిశ్రీ మాట్లాడుతూ.. “ఒక మతానికే చెందిన వారే కనెక్ట్ అవుతారని కాకుం డా.. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుందీ సినిమా” అని తెలిపింది. దర్శకుడు హర్షవర్దన్ మాట్లాడుతూ.. “కుటుంబ కథా చిత్రంగా మా ‘కరుణామయ’ తెరకెక్కబోతోంది. తండ్రీకొడుకు నేపథ్యంలో మంచి ఎమోషన్స్‌తో కూడిన కథగా సినిమా ఉంటుంది” అని చెప్పారు. ‘క్రిస్మస్ సందర్భంగా మా సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం’ అని నిర్మాత నాగేశ్వరరావు తెలిపారు.






