గాలి దుమారంతో నేలకొరిగిన భారీ వృక్షం
17-03-2026 12:24 AM
తూప్రాన్, మార్చి 16.తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో భారీ వృక్షం నేలకూలడంతో పెను ప్రమాదం తప్పింది. గుండ్రెడ్డిపల్లి నుంచి మల్కాపూర్ వెళ్లే రహదారి పై గాలి దుమారం తో కూడిన వర్షం కారణంగా చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.
ఆ సమయంలో అక్కడ ఎవరు రాకపోకలు సాగించకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ గ్రామస్తులతో కలిసి ట్రాక్టర్ సహాయంతో చెట్టును రోడ్డు పై నుండి తొలగించారు. తక్షణమే స్పందించి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించిన సర్పంచ్ పై పలువురు ప్రశంసలు కురిపించారు.




