17 March, 2026 | 1:39 AM

ఫరూక్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

17-03-2026 12:25 AM
  1. కాలిబూడిదైన ఫర్నిచర్ దుకాణం
  2. దట్టమైన పొగతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి
  3. అక్కడే ఇండేన్ గ్యాస్ గోదాం.. - అప్రమత్తమైన ఫైర్ సిబ్బందితో తప్పిన ముప్పు 
  4. భారీగా ఆస్తి నష్టం.. షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక అంచనా 
  5. కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 16 (విజయక్రాంతి): నగరంలోని పాతబస్తీ ప్రాం తం భారీ అగ్నిప్రమాదంతో ఉలిక్కిపడింది. ఫలక్‌నూమా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివారం అర్ధరాత్రి ఫరూక్‌నగర్‌లోని బస్ డిపో పక్కనే ఉన్న ఒక దుకాణంలో ప్రారంభమైన మంటలు, చూస్తుండగానే పక్కనే ఉన్న ఫర్నిచర్ షోరూమ్‌ను విస్తరించాయి. మంటల ధాటికి ఆకాశమంతా దట్టమైన పొగ కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భ యాందోళనకు గురయ్యారు.

ప్రమాద స్థలానికి అతి సమీపంలోనే గ్యాస్ సిలిండర్ల గో దాం ఉండటంతో పెను ప్రమాదం సంభవిస్తుందేమోనన్న ఆందోళనతో నగరవాసులు భీతిల్లారు. నిద్రలో ఉన్న స్థానికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.  భారీగా కమ్ముకున్న పొగతో సమీప ఇళ్లలోని వారు ఊపిరి ఆడక ఇబ్బందులు పడ్డారు. సమాచా రం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది 4 నుంచి 5 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

కాగా మంటలు చెలరేగిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే ఇండేన్ గ్యాస్ గోదాం ఉంది. ఒకవేళ మంటలు గోదాం వైపు వ్యా పించి ఉంటే, సిలిండర్లు పేలి భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేది. అయితే పోలీసు లు, అగ్నిమాపక సిబ్బంది సమన్వయం తో వ్యవహరించి, మొదటగా మంటలు గోదాం వైపు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. నీటిని భా రీగా చిమ్ముతూ మంటలను నియంత్రించడంతో పెను విపత్తు తప్పింది. ఈ అగ్నిప్ర మాదంలో ఫర్నిచర్ షాపుతో పాటు మరో దుకాణం పూర్తిగా కాలిబూడిదయ్యాయి.

సుమారు లక్షలాది రూపాయల విలువైన ఆస్తి నష్టం సంభవించినట్లు యజమానులు వా పోతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఫలక్‌నూమా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు జరుపుతున్నారు.