9 May, 2026 | 11:25 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణస్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోదీ   •   ఒంగోలులో భూకంపం.. భయపడ్డ జనం   •   కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •  

వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన న్యాయమూర్తి

05-02-2025 08:13 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి బుధవారం కొత్తగూడెంలోని నాలుగు వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కళాశాల బాలికల వసతి గృహము ఏ పవర్ హౌస్ బస్తీ, పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఏ పవర్ ఆఫ్ బస్తి, సింగరేణి ఉమెన్స్ కాలేజీ ఎదురుగా ఉన్న బీసీ బాలికల వసతి గృహము, ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహములను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సదుపాయాలు కల్పించాలని వార్డెన్స్ కు ఆదేశించారు.

ఈ సందర్బంగా వసతి గృహంలోని తరగతి గదులు, కిచెన్ రూం, స్టోర్ రూమ్ లను న్యాయమూర్తి పరిశీలించారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహర మెనూను పరిశీలించి నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని హాస్టల్ వార్డెన్ కు తెలిపారు. ఈ నాలుగు హాస్టల్స్ లలో ఆహారపు మెనును, సమయపాలన పాటించని సిబ్బంది పట్ల న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసారు. న్యాయమూర్తితో పాటు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు తనిఖీలో పాల్గొన్నారు.