ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)
- అన్నవాహిక క్యాన్సర్ చికిత్సలో ఏవోఐ రికార్డు
- రోబోటిక్ సర్జన్ డాక్టర్ జగదీశ్వర్‌గౌడ్ వెల్లడి
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (ఏవోఐ) అన్నవాహిక క్యాన్సర్ చికిత్సలో ప్రపంచ స్థాయి రికార్డు సృష్టించిం ది. ట్రిపుల్ ఐసీజీ ఫ్లోరోసెన్స్’ అనే అత్యాధునిక సాంకేతికతను రోబోటిక్ సర్జరీతో కలిపి దేశంలోనే తొలిసారిగా విజయవంతంగా ప్ర యోగించిందని ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ జగదీశ్వర్‌గౌడ్ గజగౌని వెల్లడించారు. కంటికి కనిపించని అతి చిన్న క్యాన్సర్ గడ్డలను కూడా ఈ ట్రిపుల్ ఐసీజీ టెక్నాలజీ ద్వారా స్పష్టంగా గుర్తించి, తొలగించవచ్చు. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన 54 ఏళ్ల రోగికి ఈ పద్ధతిలో విజయవంతంగా సర్జరీ చేశారు. సర్జన్ డాక్టర్ జగదీశ్వర్‌గౌడ్ గజగౌని నేతృత్వంలో ఈ చికిత్స జరిగింది.
మొదటగా క్యాన్సర్ కణజాలాన్ని కచ్చితంగా గుర్తిం చడం, ఆ తర్వాత శస్త్రచికిత్స సమయంలో రక్త ప్రసరణను పర్యవేక్షించడం, శ్వాసనాళం వంటి కీలక భాగాలకు ఎటువంటి హాని కలగకుండా రక్షణ కల్పించడం చేస్తుంది. ఈ వి నూత్న పద్ధతిపై చేసిన పరిశోధనకు అమెరికాలోని మయామిలో అంతర్జాతీయ అవా ర్డు లభించింది.
ఈ ఆసుపత్రిలో ఇప్పటివరకు 486కు పైగా రోబోటిక్ అన్నవాహిక శస్త్రచికిత్సలు జరిగాయి. అత్యాధునిక ’డా విన్సీ ఎక్స్’ రోబోటిక్ ప్లాట్ఫారమ్‌ను ఉపయోగిస్తూ, విదేశీ రోగులకు సైతం హైదరా బాద్‌ను ఒక ప్రధాన వైద్య కేంద్రంగా ఏవోఐ మార్చింది. మేము సర్జరీని కేవలం అనుమానంతో కాకుండా, ఇమేజ్ గైడెడ్ టెక్నాలజీతో అత్యంత కచ్చితత్వంతో చేస్తున్నాము. దీనివల్ల రోగులు త్వరగా కోలుకుంటున్నారు, అని డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.






