8 May, 2026 | 2:39 PM

రక్తదానంతో ప్రాణాలు నిలబెడుతున్న సంజీవనుడు

17-09-2025 12:10 AM

మణుగూరు, సెప్టెంబర్ 16,( విజ య క్రాంతి) : రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం కానీ, దీనిపై ఇప్పటివరకు చాలామందిలో అవగాహన అంతంత మాత్రమే. కానీ, మణుగూరు పీవీ కాలనీకి చెందిన మానవ హక్కుల సంఘం నేత, సింగరేణి ఉద్యోగి మందాడి సంజీవరావు మాత్రం ఆపద సమయంలో నేను న్నానంటూ పదు ల సంఖ్యలో రక్తదానాలు చేస్తూ ఎందరో ప్రాణాలను నిలబెడు తున్నారు.

సోమవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రి లో సమత అనే మహిళ కు అత్యవసర చికిత్స కోసం రక్తం అవసరం కాగానే విషయం తెలుసుకున్న సంజీవరావు ఆస్పత్రికి వెళ్లి రక్తదానం, చేసి ప్రాణాలను నిలిపే సంజీవనుడుగా నిలిచా రు. ఈ సందర్బంగా సంజీవ రావు విజయక్రాంతితో మాట్లాడారు.

ఎన్నడూ రక్తం కొ రతతో ఏ ప్రాణం పోకూడదని, ఇందుకోసం ఆరోగ్యవంతులు స్వచ్ఛం దంగా రక్తదానం చేయ డానికి ముందుకు రావాలనే ఉద్దేశం తో సామాజిక సేవలో భాగంగా ఆపదలో ఉ న్న వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో దూ రాన్ని సైతం లెక్కజేయకుండా జిల్లాలో ఇప్పటి వరకు అత్యవసర పరిస్థి తుల్లో ఉన్న వారికి రక్తదానం చేశానని తెలిపారు. రక్తదానంచేయడం సామాజిక బాధ్యతగా గుర్తిం చి యువత ఆదర్శంగా నిలవాలన్నారు.