వావిలాల పాఠశాలలో హిందీ దివస్
17-09-2025 12:10 AM
జిన్నారం, సెప్టెంబర్ 16 :గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని వావిలాల ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం హిందీ దివస్ కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్, హిందీ పండిత్ మాధవిలత విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.
అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశా రు. శ్రీచరణ్ తులసీదాస్, హర్ష కబీర్ దాస్, రిషికా వర్మా మీరాబాయి ఏకపాత్రాభినయంతో అందరిని అలరించారు. ఈ కార్య క్రమంలో రాజారావు, వైవీ శర్మ, రుషి, రాజిరెడ్డి, జయలత, పవన్, రాజు, పెంటయ్య, వి ద్యార్థులు పాల్గొన్నారు.






