12 July, 2026 | 6:09 PM

Breaking News

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •  

చిటుకు వైబ్.. రజినీ కూల్ స్టెప్స్..

13-12-2024 12:00 AM

రజినీకాంత్ గురువారం తన 74వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయనకు ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న ‘కూలి’ చిత్రం నుంచి ఒక సర్‌ప్రైజ్‌ను మేకర్స్ వదిలారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.

ఈ చిత్రం నుంచి చిటుకు వైబ్‌ను మేకర్స్ రజినీ పుట్టిన రోజు కానుకగా విడుదల చేశారు. రజినీ కూల్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కంపోజిషన్‌లో రూపొందిన చిటుకు వైబ్ అద్భుతంగా అనిపిస్తోంది. వైబే ఇలా ఉంటే సాంగ్ మరింకెంత బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.