అసామాన్యుడి వీర విప్లవ గాథ విడుదల 2
విజయ్ సేతుపతి, వెట్రిమారన్ కాంబోలో రూ పొందిన ‘విడుదల -1’ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్ సేతు పతి, వెట్రిమారన్ కాంబినేషన్‌లో ‘విడుదల-2’ చిత్రం రూపొందుతోంది. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా పాత్రికేయు ల సమావేశంలో చిత్ర నిర్మాత చింతపల్లి రామారావు ఆసక్తికర విషయాలను తెలిపారు. చిత్ర కథాంశం గురించి ఆయన వివరించారు.
“ఈ చిత్ర కథాంశాన్ని చెప్పాలంటే.. పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉద్భవించిన ఒక అసా మాన్యుడి వీర విప్లవ గాథే ‘విడుదల-2’. ఈ చిత్రం తమి ళ చిత్రం కాదు. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. ఈ చిత్రంలో పెరుమాళ్ పాత్రకు సేతుపతి నూటికి నూరు శాతం సరిపోయాడు. నక్సెలైట్ పాత్రలో విజయ్ సేతుపతి నటన, పాత్రలోని ఎమోషన్ ఆయన పండించిన విధానం అద్భుతం. విజయ్, మంజు వారియర్ మధ్య ఎమోషన్స్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి” అన్నారు.






