మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
28-04-2026 12:40 AM
తాడ్వాయి, ఏప్రిల్, 27( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని బ్రహ్మాజీ వాడి గ్రామస్తులు సోమవారం తహసిల్దార్ శ్వేతకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రబీలో పండించిన మక్కలు ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి తాడ్వాయి లో మక్కలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. బయట మార్కెట్లో దళారులు పూర్తిగా తక్కువ రేటుకు కొంటున్నారని వారు తెలిపారు రైతులు రవీందర్ రావు, రాజేందర్, రాములు, నర్సింలు పాల్గొన్నారు.






