గోమాతను జాతీయమాతగా ప్రకటించాలని వినతి
28-04-2026 12:41 AM
భిక్కనూర్, ఏప్రిల్ 27:(విజయ క్రాంతి): గోమాతను జాతీయమాతగా, దేశమాతగా ప్రకటించి గోవధను నిషేధించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల ద్వారా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రులకు మెమోరండాలు పంపించారు. అందులో భాగంగా భిక్కనూర్లో కూడా గోమాత ఆరాధన ఉద్యమం ఆధ్వర్యంలో వేలాది ప్రజల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మార్వో సునీత కు సమర్పించారు. గోరక్షణకు చట్టబద్ధ రక్షణ కల్పించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో పలువురు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






