ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..
11-12-2025 12:00 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాం తి): ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూ ర్ వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఆదిలాబాద్ నుండి భీంపూ ర్ మండలం కరంజీ గ్రామానికి బయలుదేరిన బస్సు జందాపూర్ గ్రామ సమీపంలోని రోడ్డు మూలమలుపు వద్దక ఒక్కసారిగా బస్సు ముందరి భాగం టైర్ పేలింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే డ్రైవర్ చాకచక్కంగా వ్యవహరించి బస్సును అక్కడే నిలిపివేశాడు. ఈ ప్రమాదంలో బస్సు రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దిగి ఓవైపు వంగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నైట్ ఆల్టింగ్ బస్సు కావడంతో బస్సులో సుమారు వందమంది ప్రయాణిస్తున్నారు.






