calender_icon.png 18 December, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్, బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి..?

11-12-2025 12:00:00 AM

మాజీ మంత్రి జోగు రామన్న 

బేల, డిసెంబర్ 10 (విజయక్రాంతి) :  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా 6 గ్యారంటీలు అమలు చేయలేదు కానీ, కేసీఆర్‌ను విమర్శించడం తప్పా చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చేసే అరాచకాలను గమనిస్తున్నారని వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

పంచాయతీ ఎన్నికల ప్ర చారంలో భాగంగా బుధవారం బేల మం డ లం పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామన్న బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు  ప్రజలకు ఏమి చేశారని వారికి ఓట్లు వేయాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, నాయకులు ప్రమోద్‌రెడ్డి, సతీష్ పాల్గొన్నారు.