11-12-2025 12:00:00 AM
తానూర్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): తానూర్ మండలంలోని జాల బి చెరువు మర మ్మత్తులకు 1 కోటి 18 లక్షల 50 వేల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. జి. వో. నెంబర్ 352 ద్వారా ప్రభుత్వం పాలనపరమై న అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. చెరువు పూర్తి అయితే కర్భాల, జాల ఆయకట్టు రైతులకు 200 ఎకరాల వరకు సాగునీరు అందుతున్నారు. త్వరలో చెరువు పునరు ద్దరణ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేయించిన మంత్రులకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ధన్యవాదములు తెలిపారు.