30 June, 2026 | 10:09 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఆలేరు ఎమ్మెల్యే ఇంట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య..

14-06-2025 10:28 PM

ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు రాజకీయ పార్టీలు..

హత్య, ఆత్మహత్య, కోణంలో పోలీసుల దర్యాప్తు..

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Government Whip Beerla Ilaiah) ఇంట్లో ఆయన వ్యక్తిగత సహాయకుడు గంధ మల్ల రవి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి 12, ఒంటిగంట సమయంలో మృతుడు ఉంటున్న మూడో అంతస్తులో ఉరి వేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. ఆయన మృతి పై కుటుంబ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే స్వగ్రామమైన సైదాపురం గ్రామానికి చెందిన వాడైన గంధ మల్ల రవి గత కొంతకాలంగా ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకునిగా ఇంట్లో పనిచేస్తూ భార్య పిల్లలతో కలిసి ఎమ్మెల్యే ఇంట్లో మూడో ఫ్లోర్ లో అంటున్నాడు. ఆర్థిక సమస్యల తో కొదకొద్ది రోజులుగా భార్యతో గొడవ జరుగుతున్నట్లుగా తెలిసింది. రవిని ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా లేక వ్యక్తిగత  సమస్యలతో  ఆత్మ హత్యకు పాల్పడ్డాడా అని పలు  కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్టకు చేరుకొని కుటుంబ సభ్యుల ఓదార్చారు.