30 June, 2026 | 10:10 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పేద ప్రజల సొంత ఇంటి కల కాంగ్రెస్ తోనే సాధ్యం

14-06-2025 10:33 PM

కాంగ్రెస్ మండల అధ్యక్షులు గోడిశాల రామనాదం..

పినపాక (విజయక్రాంతి): పేద ప్రజల సొంత ఇంటి కలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం(Congress Mandal President Ramanatham) అన్నారు. శనివారం పినపాక మండలం(Pinapaka Mandal) వెంకట్రావుపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు నూతనంగా నిర్మించే ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చిందన్నారు.

పేద ప్రజలకు న్యాయం జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రతి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. గూడుతోపాటు కూడు ఉండాలని నూతన రేషన్ కార్డులు సైతం మంజూరు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాటూరి ప్రవీణ్, కొంబత్తిని శ్రీనివాస్, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.