calender_icon.png 4 July, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టకాలంలో పార్టీలో ఉన్న వారికే నామినేటెడ్ పదవులు

14-06-2025 10:25:39 PM

పార్టీలో ఎవరు కష్ట పడుతున్నారో అన్ని వివరాలు తెప్పించుకుంటున్నాం..

సిద్ధిపేట (విజయక్రాంతి): అత్తు ఇమామ్ అధైర్య పడకు నీకు నేను కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హామీని ఇచ్చినట్లు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్ ఎలా ఉన్నావు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలి అని అందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పని చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాలి అని అన్నారు. అందరి వివరాలు తెప్పించుకుంటున్నాము అని పార్టీని నమ్ముకుని ఉన్న వారికే మొదటి ప్రియారిటిగా పదవులు కట్టబెడతామని హామీ ఇచ్చారు అని అన్నారు.