మిడిల్ క్లాస్‌కూ ఓ మ్యానిఫెస్టో!
భారతదేశంలోని మధ్యతరగతి ఒక జనాభా మాత్రమే కాదు; ఇది ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ. దేశానికి వెన్నెముక లాంటి ఈ వర్గం వినియోగాన్ని నడిపిస్తుంది, ప్రత్యక్ష పన్నుల్లో ఎ క్కువ భాగాన్ని చెల్లిస్తుంది, వికసిత భారత్ ల క్ష్యాలకు జగన్నాథ రథచక్రాలుగా నిలుస్తుం ది.
కీలకపాత్ర ఉన్నప్పటికీ, మధ్యతరగతి పె రుగుతున్న ఖర్చులు, స్థిరంగా లేని ఆదాయా లు, విధాన లోపాలు, అవినీతి, కులవాదం, న్యాయ ఆలస్యం, నైపుణ్యాలు, విద్య మధ్య పెరుగుతున్న అంతరం వంటి లోతైన సా మాజిక సమస్యల ఒత్తిడిని ఎదుర్కొంటోం ది. 2030 నాటికి భారతదేశం అప్పర్ మిడి ల్ ఇన్‌కమ్ దేశంగా మారే ఈ సమయంలో, స్పష్టమైన, కార్యాచరణాత్మక మధ్యతరగతి మ్యానిఫెస్టో అత్యవసరం. దీనిని రాజకీయ పార్టీలు స్వీకరించాలి. మధ్యతరగతి స్వయం గా ముందుకువచ్చి ఆర్థిక చక్రాన్ని మాత్రమే కాకుండా రాజకీయ వ్యవస్థను నడిపించాలి.
భారత్‌లో మధ్యతరగతి ఎవరు?
భారత్‌లో సాధారణంగా ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.36 లక్షల మధ్య ఆదాయం సంపాదించే కుటుంబాన్ని మధ్యతరగతి కు టుంబంగా నిర్వచిస్తారు (2024 -25 ధరల ప్రకారం). ఈ నిర్వచనం వినియోగ ధోరణులను ప్రతిబింబిస్తుంది, అంటే ప్రైవేట్ విద్య, ఆరోగ్య సంరక్షణ, గృహ రుణ ఈఎంఐలు, వాహనాలు, ఐచ్ఛిక ఖర్చులను భరించగలగడం, అలాగే భవిష్యత్తు కోసం పొదుపు చే యడం. ఈ వర్గం ప్రధానంగా పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో వేతన జీవులుగా, చిన్న వ్యాపారాలు చేస్తూ, సాంకేతిక, సేవా రంగా ల్లో పనిచేసే వారిని కలిగి ఉంటుంది.
మిడిల్ క్లాస్ శాతం ఎంత?
2025 నాటికి భారత జనాభా 145 కోట్లుగా ఉంటుందని అంచనా. వీరిలో మధ్యతరగతి 56 కోట్లకు పైగా ఉంటుందని పలు నివేదికలు చెప్తున్నాయి. ఇది మొత్తం జనాభాలో సుమారు 40 శాతం. ౨౦౪౭ నాటికి ఇది 60 శాతానికి పెరుగుతుందని అంచనా. ఇది భారత సామాజిక-, ఆర్థిక మార్పునకు ప్రధాన శక్తిగా నిలుస్తుంది.
మధ్యతరగతి సహకారం ఏమిటి?
మధ్యతరగతి భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఇంజిన్‌గా పనిచేస్తుంది. 1. ఇది వినియోగ శక్తి కేంద్రం, ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్ (పీఎఫ్‌సీఈ)లో ప్రధాన భాగం ఈ వర్గం నుంచే వస్తుంది. ఇది 2024- ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో సుమారు 60 శాతం వరకు ఉంది. 2. పన్నుల వెన్నెముక, వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వ ఆదాయంలో పెరుగుతున్న వాటాను అందిస్తున్నారు.
అం తేకాదు, 2026 ఆర్థిక సంవత్సరం నాటి కి వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు రూ. 14.66 లక్షల కోట్లకు చేరుతాయని అంచనా. 3. ఇది వృద్ధి, మానవ మూలధనం, భౌతిక ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతుంది. బలమైన మధ్యతరగతి లేకుండా,2028 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారడం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడం కష్టసాధ్యమవుతుంది.
మిడిల్ క్లాస్ సమస్యలు
మిడిల్ క్లాస్ భారత్ ప్రగతికి ప్రధాన భాగస్వామి అయినప్పటికీ, వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. 1. పన్ను, ద్రవ్యోల్బణ భారం ఎక్కువగా ఉండి, తక్కువ సబ్సిడీలు పొందుతోంది. 2. విద్య ఖర్చులు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు, ఆరోగ్య ఖర్చులు అధికంగా ఉండటం, రూ. 50 లక్షలకు పైగా గృహ రుణ ఈఎంఐలు కుటుంబ ఆదాయంలో 50 శాతం వర కు ఖర్చవుతున్నాయి. 3. ప్రారంభ రుణాలు, జీవనశైలి ఖర్చులు అప్పుల బారినపడే పరిస్థితిని కలిగిస్తున్నాయి.
4. ఉద్యోగ, ఆదాయ భద్రత లేకపోవడం, ఏఐ ప్రభావం, పట్టణ నిరుద్యోగం ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి. 5. అవినీతి పెద్ద సమస్యగా ఉంది. సీపీఐ 2025 స్కోరు 39/100, ర్యాంక్ 91గా ఉండి, ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉంది. దీని ప్రభావం ఎక్కువగా మధ్య తరగతిపై పడుతోంది. 6. కుల సంబంధిత అడ్డంకులు అవకాశాలను ప్రభావితం చేస్తున్నాయి. 7. రెడ్ టేప్, బ్యూరోక్రసీ సమస్యలు కొనసాగుతున్నాయి. లైసెన్స్‌రాజ్, అడుగడుగునా అడ్డంకులు, రాజకీయ అధికారుల టోల్‌గేట్లు, ఆలస్యాలు, కస్టమ్స్ సమస్యలు వ్యాపారాలను అడ్డుకుంటున్నాయి. 8. న్యాయ ఆలస్యం తీవ్రమైనది. 5.39 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
9. స్వ యం ఉపాధి రుణాల్లో అంతంతమాత్రం, ముద్ర యోజన ద్వారా రూ.32.61 లక్షల కోట్లు పంపిణీ అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాల మీద ఎక్కువ దృష్టిపె డుతూ, ఉత్పాదక పెట్టుబడులకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. 10. ఉపాధి ఆధారిత విద్య లోపిస్తోంది. 15 వయస్సులో 40 శాతం, 25- వయస్సులో 20 శాతం నిరుద్యోగులు, ఉపాధి సామర్థ్యం 54.81 శాతమే ఉంది. ఒక విదంగా భారత మధ్యతరగతి అనేక అడ్డంకులు దాటుకుంటూ, ము ళ్ల బాటలు ఛేదించుకుంటూ, కురుక్షేత్రంలో అభిమన్యుడి లాగ అటు స్వయం, ఇటు భారత్ ప్రగతికి దోహదపడుతోంది.
రాజకీయ పార్టీల బాధ్యత ఏమిటి?
రాజకీయ పార్టీలు మధ్యతరగతి సమస్యలను నేరుగా పరిష్కరించే విధంగా కార్యాచర ణాత్మక మ్యానిఫెస్టో అవశక్యత ఉంది. 1. పన్ను సంస్కరణలు, ద్రవ్యోల్బణానికి అనుసంధానించాలి. ఉద్యోగస్తులే కాకుండా, పన్నుల ఎగవేతదారులను టాక్స్ నెట్‌లోకి తేవాల్సిన అవసరం ఉంది. అలాగే రూ.వం దల కోట్ల ఆస్తులు ఉన్న భూస్వాములు, ఇతరులకు వెల్త్ టాక్స్ అమలు చేయాల్సిన అవ సరం ఉంది. సంపాదన మీదే కాకుండా సం పద మీద టాక్స్ ఉండాలి.
2. విద్యా విప్లవం కోసం జీడీపీలో 6 శాతం ఖర్చు చేయాలి. ఉపాధి నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. 3. ఆరోగ్య భద్రత కోసం బీమాతోపాటు సర్వత్రా ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలి. ప్రైవేట్ వైద్యంపై నియంత్రణ తక్ష ణ అవసరం. 4. గృహ, రుణ సడలింపులు ఇవ్వాలి. మొదటి ఇంటి నిర్మాణానికి ప్రత్యేక పన్నురాయితీ ఉండాలి. 5. అవినీతి వ్యతిరేక చర్యలు తీసుకోవాలి. మిడిల్ క్లాస్‌కు అవినీతి దినదినగండంగా మారుస్తుంది. 6. కుల సమానత్వం కోసం చర్యలు తీసుకోవాలి.
కులం కాకుండా ఆర్థిక వర్గీకరణ జరగాలి. 7. బ్యూరోక్రసీ సంస్కరణలు చేయాలి, అది ఒక నల్ల పిల్లిలాగా ఆటంకం కాకూడదు. 8. న్యాయ సంస్కరణలు చేయాలి. 9. స్వయం ఉపాధి రుణాలకు సెల్ఫ్ ఫండ్ ఏర్పాటు చేయాలి. బడ్జెట్‌లో రెవెన్యూ, కాపిటల్ ఖ ర్చు నియంత్రణ ఉండాలి. 10. ఉపాధి ఆధారిత నైపుణ్యాలు పెంచాలి. 11. మౌలిక సదు పాయాలను అభివృద్ధి చేయాలి. 12. మధ్యతరగతి బడ్జెట్ కోసం ప్రత్యేక డిక్లరేషన్ ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణ, ఎస్టేట్ పన్ను, సహకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలి. వీటి ద్వారా భారత్‌లో పావర్టీ నిల్, మిడిల్ క్లాస్ ఫుల్, రెస్పాన్సల్ రిచ్ సమాజాన్ని నిర్మించాలి.
ఇతర దేశాల నుంచి పాఠాలు
దక్షిణ కొరియా, చైనా, సింగపూర్, జర్మ నీ దేశాలు మధ్యతరగతిని బలపరిచి అభివృ ద్ధి సాధించాయి. కార్పొరేట్ దిగ్గజాల ని యంత్రణ, పన్ను సంస్కరణలు, సంపద రీసైకిల్, కులం, వర్గం, మనం, క్రోనీ క్యాపిటలి జం అణచివేత ద్వారా సింగపూర్ అన్ని దేశాలకు ఒక ప్రగతి లైట్ హౌస్ అయ్యింది. నా ణ్యమైన, అందుబాటులో విద్య, వైద్యం, గూడు, నిర్దిష్టమైన రిటైర్‌మెంట్ ఫండ్ సింగపూర్ ప్రభుత్వం మధ్యతరగతికి కల్పించే ప్రధాన వనరులు.
మధ్యతరగతి ఏమి చేయాలి?
మధ్యతరగతి ఒక ఐక్య ఓటుబ్యాంకుగా మారాలి. ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలి. అవినీతిపరుల ప్రభావానికి లోనుకాకూడ దు. పారదర్శకత, న్యాయం, మెరిట్ ఆధారిత పాలనను కోరాలి. అమృతకాలం 2047 నాటికి భారత్‌ను ఆర్థిక సూపర్ పవర్‌గా మార్చడంలో కీలకపాత్ర పోషించాలి.
దానికి ముఖ్యంగా ప్రతి ఇంట్లో రాజకీయ విశ్లేషణ జరగాలి. రాజకీయాల్లో ప్రేక్షకపాత్ర వహించ కుండా, మిడిల్ క్లాస్ ఎన్నికల్లో కనీసం ఒక వారం రోజలు ‘మిడిల్ క్లాస్ మ్యానిఫెస్టో’ కోసం ప్రచారం చేయాలి. కులరహిత, గుణ భరిత భారత్ నిర్మాణం కోసం మిడిల్ క్లాస్ కంకణం కట్టుకోవాలి. మిడిల్ క్లాస్ ఒక ఓటుబ్యాంకుగా మారాలి. మిడిల్ క్లాస్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మతాలు, కులాలకతీతంగా అన్ని వర్గాల్లో ఉంటారు. ఈ వర్గం బలపడితే అటు అవినీతి, ఇటు కుల రాజకీయాలు మరుగునపడే అవకాశం ఉంది.
వ్యాసకర్త: మాజీ ఎంపీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు






