15 July, 2026 | 12:39 AM

ఓల్డ్ బోయిన్‌పల్లిలో విరిగిన భారీ వృక్షం

15-07-2026 12:39 AM

మాజీ కార్పొరేటర్ ముద్దం ఆదేశాలతో తొలగింపు..

సికింద్రాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ఓల్ బోయిన్ పల్లి డివిజన్ మైత్రి వనం కాలనీలో భారీ వృక్షం విరిగి పడడంతో కాల నీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మాజీ కార్పొరేటర్  ముద్దం నరసింహ యాదవ్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని ప్రైవేటు వ్యక్తులతో చెట్లను తొలగించారు.

దీంతో పాటు విద్యుత్ స్తంభం పడిపోవడంతో విద్యుత్తు నిలిపివేసి తొలగించారు. విరిగిపోయిన విద్యుత్ స్తంభం స్థానంలో విద్యుత్ శాఖ అధికారులు కొత్త స్తంభాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు, ముద్దం నరసింహ యాదవ్‌కు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, బిఆర్ఎస్ నాయకులు చందు యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.