29 June, 2026 | 8:02 PM

పాక్‌తో మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే

08-06-2024 12:43 AM

న్యూయార్క్: దాయాదుల పోరు అంటే ప్రేక్షకులకే కాదు ఇరుజట్ల ఆటగాళ్లకు కూడా టెన్షన్ ఉంటుందని టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు. ‘పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడి సహజం. ప్రపంచమంతా ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్ కేవలం పోరాటం మాత్రమే కాదు.. ఒక చరిత్ర అవుతుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు భావోద్వేగాలతో కూడి ఉంటుంది. నా వరకైతే పాక్‌తో మ్యాచ్ స్పెషల్‌గా అనిపిస్తుంది’ అని పాండ్యా అన్నాడు.