29 June, 2026 | 8:02 PM

ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలానికి ఎన్ఓసీ మంజూరు

29-06-2026 07:08 PM

బోథ్,(విజయక్రాంతి): పిచ్చోడ మండల కేంద్రంలో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి ఎలాంటి అడ్డంకులు లేవని సర్వే బృందం అధికారులు పేర్కొన్నారు. పాఠశాల భవనం నిర్మిస్తున్న స్థలంలో బఫర్ జోన్ ఉందని కొంతమంది వ్యక్తులు పేర్కొనడంతో ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పూర్తిస్థాయిలో సర్వేలు నిర్వహించాలని ఇరిగేషన్ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఆదేశించారు.

దీంతో సోమవారం ఇరిగేషన్ రాథోడ్ ప్రకాష్ యాదవ్ సాంఘిక సంక్షేమ శాఖ కన్సల్టెంట్ ఇంజనీర్ అశోక్ ఏ ఈ ఈ తుల సతీష్ లు సర్వేలో పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు లేవని సైట్ ఫైనల్ లేఔట్ లపై చర్చించి లేఅవుట్ మ్యాప్ ను ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కు అందించారు పాఠశాల నిర్మాణం వల్ల అక్కడ సమకూర్చాల్సిన సదుపాయాలు అభివృద్ధి పనుల ప్రణాళికను ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. సర్వే బృందం ఇబ్బందులు లేవని తేల్చి చెప్పడంతో పాఠశాల నిర్మాణానికి మార్గం సుగమనమైయింది.