జూన్ 10 నుంచి ఖేలో ఇండియా
న్యూఢిల్లీ: దేశవాలీ టోర్నీ ‘ఖేలో ఇండియా’ ఉమెన్స్ లీగ్ 4వ సీజన్ జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. కర్నాటకలోని బాగల్‌కోట్ వేదికగా జరగనున్న టోర్నీలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీల్లో పోటీ పడేందుకు 300 మంది అథ్లెట్లు సిద్ధమవుతున్నారు. సౌత్ జోన్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, కేరళ, అండమాన్, లక్షద్వీప్, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్లేయర్లు పాల్గొంటున్నారు. 2023 సీజన్‌లో నిర్వహించిన ఖేలో ఇండియా గేమ్స్‌లో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 18 క్రీడా విభాగాల్లో 56వేల మంది మహిళా అథ్లెట్లు పాల్గొనడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యం వెలికి తీయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2017 ఖేలో ఇండియా క్రీడకు అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే.






