12-10-2024 01:19:05 AM
సుహాస్, సంగీర్తన హీరోహీరోయిన్లుగా ‘జనక అయితే గనక’ చిత్రాన్ని సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని హర్షిత్‌రెడ్డి, హన్షితరెడ్డి నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదల కానుం దీ చిత్రం. ఇప్పటివరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినీప్రియుల ఆదరణ పొందాయి.
ఇప్పటివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేసిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ గురువారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిం చింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు బలగం వేణు, వశిష్ట ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంలో బలగం వేణు మాట్లాడుతూ.. “జనక అయితే గనక’ ఫ్యామిలీ అందరూ నవ్వుతూ ఎంజాయ్ చేసేలా సందేశాత్మక చిత్రం కానుంది’ అని తెలిపారు.
“ఇంత సెన్సిటివ్ పాయింట్‌ను అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా చేశారు. దిల్ రాజు బ్యానర్ వచ్చిన ‘బొమ్మరిల్లు’ రేంజ్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది” అని డైరెక్టర్ వశిష్ట అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ‘నా 21 ఏళ్ల సినీ కెరీర్లో ఎంతో మంది దర్శకుల్ని పరిచయం చేశాను.
చిన్న చిత్రాలను, కొత్త టాలెంట్‌ను తీసుకు రావాలని అనుకున్నాం. అలా ‘బలగం’ వచ్చింది. ఇప్పుడు సందీప్, ఆ తర్వాత శశి వస్తున్నాడు. ఇలాంటి చిన్న చిత్రాలు తీయాలనే ఆత్రుత, భయం రెండూ ఉంటాయి. కానీ ఈ చిత్రాలతోనే ఎక్కువ టాలెంట్ బయటకు వస్తుం’ అని తెలిపారు. మిగతా చిత్రబృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.