12-10-2024 01:20:00 AM
సుధీర్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ బలుసు నిర్మించారు. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిచంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు.
అక్టోబర్ 11న విడుదలైంది. సినిమా విడుదల కంటే ముందు ప్రదర్శించిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన వచ్చిందని, ఈ కారణంగా తొలి రోజు థియేటర్లు కళకళలాడాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంతోషాన్ని మేకర్స్ మీడియాతో పంచుకున్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ.. “దాదాపు పది థియేటర్లలో ‘మా నాన్న సూపర్ హీరో’ పెయిడ్ ప్రీమియర్స్ వేశాం.
అక్కడ్నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజాగ్‌లో ఒక మాస్ థియేటర్‌లో ఆడియన్స్ మధ్య కూర్చొని సినిమా చూశాను. మేము ఊహించినట్లే ప్రేక్షకులు కనెక్ట్ అవుతుండటం కళ్లారా చూస్తూ ఎంజాయ్ చేశా. ఇది నా కెరీర్‌లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ’ అని తెలిపారు.
డైరెక్టర్ అభిలాష్ మాట్లాడుతూ.. ‘ఫీమేల్ ఆడియన్స్ సన్ ఫాదర్ ఎమోషన్‌కి కనెక్ట్ అవుతారో లేదో అనుకున్నా. కానీ వాళ్లు కూడా చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు’ అన్నారు. హీరోయిన్ అర్ణ, యాక్టర్ శశాంక్, నిర్మాత సునీల్, మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్, డీవోపీ సమీర్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.