calender_icon.png 12 November, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెల్లపిల్లతోపాటు సమస్యలూ బోనస్

12-10-2024 01:18:16 AM

నిఖిల్ సిద్దార్థ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సుధీర్ వర్మ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్లుగా రుక్మిణి వసంత్, దివ్యాంక కౌశిక్ నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే శుక్రవారం చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది.

టీజర్‌ని బట్టి సినిమాలో నిఖిల్ ఒక రేసర్. హైదరాబాద్‌లోని ఓ బస్తీలో ఉంటాడు. లండన్‌కు వెళ్లి అక్కడ తెల్ల పిల్లను వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటాడు. లండన్‌కు వెళ్లిన నిఖిల్‌కు పిల్లతోపాటు సమస్యలు బోనస్‌గా రావడం.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమాలో చూడొచ్చని టీజర్ ద్వారా తెలుస్తోంది. 

‘స్వయంభూ’ సెట్స్‌లో ఆయుధ పూజ

నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్వయంభూ’. ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ సంయుక్తంగా స్వయంభూ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. సోషియో ఫాంటసీ జానర్ అయినప్పుడు ఆయుధాలను భారీగా వినియోగిస్తారు.

శుక్రవారం వాటన్నింటికీ ఆయుధ పూజ చేశారు. ఈ సినిమాలో వినియోగిస్తున్న ఆయుధాలు, కెమెరాలు అన్నింటినీ ఒక చోట చేర్చి పూజ నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ చిత్రంలో సంయుక్తా మేనన్, సభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.