9 June, 2026 | 2:09 AM

ప్రతి ప్రేమికుడికీ నచ్చే సినిమా

09-06-2026 01:24 AM

తండ్రీ-కొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’. దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని కేదార్‌నాథ్ నిర్మించారు. అన్విష కథానాయికగా నటించిన ఈ చిత్రం జూన్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. “మంచి కథ, బలమైన భావోద్వేగాలు ఉన్న సినిమాలు ప్రేక్షకుల గుండె ల్లో నిలిచిపోతాయి. సినీ పరిశ్రమలో టాలెంట్‌కు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది.

ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. దర్శకుడు, హీరో దుర్గాదేవ్ నాయుడు మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులతోపాటు మంచి కంటెంట్ కోసం ఎదురుచూసే ప్రతి సినీ ప్రేమికుడికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది” అన్నారు. హీరోయిన్ అన్విష మాట్లాడుతూ.. “ఈ కథలో బలమైన భావోద్వేగా లున్నాయి. సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం అప్పుడే కలిగింది” అని తెలిపారు. నిర్మాత కేదార్‌నాథ్ మాట్లాడుతూ.. “మంచి కథను నమ్మి ఈ సినిమాను నిర్మించాం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతారు” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎన్‌ఎస్ ప్రసూ, మిగతా చిత్రబృందం కూడా మాట్లాడారు.