10 June, 2026 | 1:29 AM

పంద్రాగస్టు పండుగకు బాట్వారా 1947

10-06-2026 12:00 AM

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిస్టారికల్ పీరియడ్ డ్రామా సినిమా ‘బాట్వారా 1947’. ఇప్పటిదాకా ‘లాహోర్ 1947’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా పేరును అధికారికంగా మార్చిన చిత్రబృందం తాజాగా మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇదే ఏడాది ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమాకు రాజ్‌కుమార్ సంతోషి దర్శకుడు.

ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ప్రీతీ జింటా కమ్‌బ్యాక్ ఇస్తున్న ఈ సినిమాలో శబానా అజ్మీ, అలీ ఫజల్, అభిమన్యు సింగ్, కరణ్ డియోల్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ‘జిస్ లాహోర్ నై వేఖ్యా ఓ జమ్యా ఈ నై’ అనే నాటకం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, జావేద్ అక్తర్ పాటలు రాస్తున్నారు.