10-11-2025 01:34:52 AM
మరణించిన మహిళ శరీరంలో రక్త ప్రసరణ
అవయవాలు దానం చేసేందుకు వీలుగా ప్రక్రియ చేపట్టిన మణిపాల్ ఆస్పత్రి వైద్యులు
గాంధీనగర్, నవంబర్ 9: వైద్య శాస్త్రంలో కొత్త అధ్యాయాన్ని లిఖించచారు. గుజరాత్‌లోని ద్వారకలో గల మణిపాల్ ఆస్పత్రి వైద్యులు. మహిళ మరణానంతరం ఆమె శరీరంలో రక్తప్రసరణను దానం చేసేందుకు వీలుగా ఈ ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించారు. ఆసియాలోనే ఈ ఘనత సాధించిన మొదటి ఆస్పత్రి తమదేనని చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ శ్రీకాంత్ శ్రీనివాసన్ తెలిపారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా బాధపడుతున్న గీతా చావ్లా ఈ నెల 6న మరణించింది.
కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆమె అవయవాలు దానం చేసేందుకు వీలుగా వైద్యబందం నార్మోథెర్మిక్ రీజినల్ పెర్ఫ్యూజన్(ఎన్‌ఆర్‌పీ)అరుదైన ప్రకియ నిర్వహించింది. ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రోన్ ఆక్సిజనేటర్ (ఈసీఎంఓ) ఉపయోగించి మృతురాలి ఉదర అవయవాలలో రక్తప్రసరణను విజయవంతంగా పునఃప్రారంభించారు. అనంతరం అవయవాలు సేకరించారు.